మేడారం జాతరకు  వేగంగా విద్యుత్ సరఫరా పనులు.- వేసవికాల  కార్యాచరణ పనులు  ఇప్పటి నుండే ముమ్మరం.

మేడారం జాతరకు  వేగంగా విద్యుత్ సరఫరా పనులు.- వేసవికాల  కార్యాచరణ పనులు  ఇప్పటి నుండే ముమ్మరం.

విశ్వంభర, హనుమకొండ జిల్లా :-శరవేగంగా వ్యవసాయ సర్వీసుల మంజూరు  ,16 సర్కిళ్ల ఎస్ఈలు , డి.ఈ లు , ఎస్ఏవోల వీడియో కాన్ఫెరెన్స్ లో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడి . 

మేడారం జాతరకు  వేగంగా విద్యుత్ సరఫరా పనులు జరుగుతున్నాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు .  హన్మకొండ , నక్కలగుట్ట లోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్  విద్యుత్ భవన్  కార్పొరేట్ కార్యాలయంలో  16 సర్కిళ్ల ఎస్ఈలు , డి.ఈ లు , ఎస్ఏవోలతో  శనివారం  వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.  ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో సీఎండీ  కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.
 ఇప్పటివరకు 7. 5 కిలో మీటర్ల మేర కవర్డ్  కండక్టర్ పనులు జరిగాయని , కొత్తగా 50 ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగిందని,   లైన్ ల పనులు 20 కిలో మీటర్ల వరకు పూర్తి అయ్యిందని తెలిపారు . సమయం  తక్కువ ఉన్నందున మిగత పనులు యుద్దప్రాతిపదికన  పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు . నాణ్యతగా  పనులు నిర్వర్తించాలని చెప్పారు .  అదనంగా 5 ఎంవిఏ  పవర్ ట్రాన్స్ఫార్మర్ సమ్మక్క సబ్  స్టేషన్లో పెడుతున్నామని , జంపన్న వాగు దగ్గర కొత్తగా  మూడు టవర్ పోల్ లు  ఏర్పాటు చేస్తున్నామని  చెప్పారు .   వేసవికాల  కార్యచరణ  ప్రణాళికలో భాగంగా అర్బన్ ప్రాంతాలలో  ఓవర్ లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ల  సామర్ధ్యం పెంపు పనులు వచ్చే నెలాఖరు వరకు పూర్తి చేయాలని  16 సర్కిళ్ల ఎస్ఈలను ఆదేశించారు .అలాగే  ఓవర్ లోడ్ ఫీడర్ల ఉంటె లోడ్ బదలాయింపు చేపట్టాలని తద్వారా లోడ్ తగ్గుతుందని చెప్పారు . టార్గెట్ కు అనుగుణంగా   33 కెవి ఇంటర్  లింకింగ్ పనులు పూర్తి చేయాలని  అన్నారు .   బంచింగ్ గా  ఉన్న ఫీడర్లను వేరు చేయాలని చెప్పారు . సాధ్యమైనంతవరకు లైన్ క్లియరెన్స్ (ఎల్సీ ) లు తగ్గించాలని చెప్పారు . 16 సర్కిళ్ల పరిధిలో దాదాపు 3300 వ్యవసాయ సర్వీసులు మంజూరు అయ్యాయని , వచ్చే నెల లక్షానికి అనుగుణంగా మంజూరు చేసేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్ఈలను ఆదేశించారు . పంటల కోతల సమయం కావున డిసెంబర్ నెలలో వ్యవసాయ సర్వీసులు మంజూరు  ఇంకను పెరగాలని చెప్పారు . హెచ్ టి సింగిల్ విండోసెల్ లో  సర్వీసుల  మంజూరు వేగవంతం చెయ్యాలని అన్నారు .  అలాగే టిజి ఐ పాస్ , నాన్  టిజి ఐ పాస్ లో  సర్వీసులు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు . ఎలక్ట్రిక్ ఛార్జింగ్ (ఈ వి )స్టేషన్ పనుల పై సమీక్షిస్తూ దరఖాస్తు చేసుకున్న సర్వీసుల ఆలస్యం లేకుండా పనులు పూర్తి చేయాలని  అన్నారు .  100 శాతం రెవెన్యూ వసూళ్లు జరిగేలా చూడాలని కోరారు . మ్యానువల్ బిల్లింగ్ కాకుండా ఉండటానికి పెండింగ్ ఉన్న చోట్ల   ఐఆర్ డిఏ మీటర్లను అమర్చాలని  ఓసీఆర్  ద్వారా నే బిల్లింగ్ చేయాలని  అన్నారు .  బ్రాడ్ బ్యాండ్ , కేబుల్ ఆపరేటర్లతో సమీక్షలు నిర్వహించి నిరుపయోగంగా ఉన్న కేబుళ్లను తోలగించాలని, జిఐఎస్ మ్యాప్పింగ్ ఏర్పాటు చేసుకొవాలని  చెప్పారు . గుత్తుగా  వైర్లు ఉండకుండా బంచింగ్  చేసుకునేలా  వారికి ఆవగాహన కల్పించాలని చెప్పారు .  కామన్  సర్వీసులు , మల్టీపుల్  సర్వీసులు , రాంగ్ క్యాటగిరి సర్వీసులను క్షుణంగా  తనిఖీలు చేపట్టాలని అన్నారు .    వర్క్ ఆర్డర్స్ పెండింగ్ లేకుండా చూడాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో  డైరెక్టర్లు  వి . మోహన్ రావు , వి .  తిరుపతి రెడ్డి , సి . ప్రభాకర్ ,  సి.ఈ లు టి . సదర్ లాల్ , కె . తిరుమల్  రావు , కె . రాజు  చౌహన్, అశోక్ , అన్నపూర్ణ , సురేందర్ , శ్రవణ్  కుమార్ , జయవంత్ రావు చౌహన్ ,  ,  సీజియంలు   చరణ్ దాస్, కిషన్ జియంలు :  వేణు బాబు , కృష్ణ మోహన్ , వెంకట కృష్ణ , శ్రీనివాస్ , వాసుదేవ్ ,  నాగ ప్రసాద్ , శ్రీకాంత్ , సామ్య నాయక్ , కళాధర్  తదితరులు పాల్గొన్నారు .

Read More మానవత్వం చాటుకున్న గుంటక రూప సదా శివ్

Tags: