140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి 40 ఏళ్ల బీజేపీతో పోలిక : జగ్గారెడ్డి
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాహుల్‌గాంధీ కుటుంబానిది
- దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం చేసిన అభివృద్ధి పై చర్చకు మేం సిద్ధం
- 11 ఏండ్ల మోడీ చేసిన అభివృద్ది పై చర్చకు మీరు సిద్ధమా..?
- రాహుల్ గాంధీ..తాత..ముత్తాతలది దేశం కోసం ఆస్తులు..ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర
- నేను నారాజ్ అయ్యేంత వీక్ లీడర్ ను కాదు రాజకీయాల్లో నారాజ్ అనే పదం నాకు నచ్చదు
- బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం
విశ్వంభర,హైదరాబాద్: రాహుల్ గాంధీని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించడం సరికాదని ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. లక్ష్మణ్ వయస్సు 69 ఏళ్లని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు అవుతోందని, అప్పటికింకా లక్ష్మణ్ పుట్టలేదని అన్నారు. గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ లక్ష్మణ్ తమ పార్టీ నాయకుడి గురించి మాట్లాడటం సముచితం కాదని అన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని అభివృద్ధి చేశామని, ఎఫ్‌సీఐని ఏర్పాటు చేశామని, పెత్తందారీ భూములను పేదలకు పంచామని, బ్యాంకులను పల్లెలకు తెచ్చామని, బాలానగర్ బీడీఎల్ వంటి కంపెనీలు తెచ్చామని ఆయన అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు అవుతోందని, వారు ఏం కంపెనీలు ప్రారంభించారో చెప్పాలని నిలదీశారు.
18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఐటీ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఆలోచనలే కారణమని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తోందని విమర్శించారు.అలాగే, రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు దేశం మొత్తం తెలుసు. మీ బీజేపీలో ఎవరైనా అలాంటి త్యాగం చేశారా? అని ప్రశ్నించారు. లక్ష్మణ్… నోరు ఉంది అని ఎవరిపైనా మాట్లాడలేం. ముందుగా మీ అమ్మ–నాన్నను అడుగు. గాంధీ కుటుంబం అంటే ఏమిటో వాళ్లతో తెలుసుకో. దేవుళ్ల తర్వాత దేవుళ్లు వాళ్లే అని చెబుతారు అని జగ్గారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
మోడీ ప్రధాని అయ్యి 12 ఏళ్లు అయ్యింది. దేశానికి ఏ పెద్ద కంపెనీ తెచ్చారు? ఏ పెద్ద పరిశ్రమను పెట్టించారు? ఏ మేజర్ డెవలప్మెంట్ చేశారో చెప్పండి అని అన్నారు. బీజేపీ సిద్ధమైతే ఓపెన్ డిబేట్‌కు సిద్ధం. మేము ఏం చేశాం… మీ మోడీ ఏం చేశాడు… చూసుకుందాం. ప్రజలముందే చర్చ జరగాలి అని జగ్గారెడ్డి ప్రకటించారు.
బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తుంది.. రెండో సారీ..మూడో సారి అధికారంలోకి వచ్చింది దొంగ ఓట్లతోనే అని ఆయన విమర్శించారు. సంగారెడ్డి ప్రజలు ఇచ్చిన అవకాశం తో ఎంతో అభివృద్ధి చేశా అని ఆయన అన్నారు. నేను నారాజ్ అయ్యేంత వీక్ లీడర్ ను కాదని, రాజకీయాల్లో అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఉండదన్నా జగ్గారెడ్డి. సంగారెడ్డి డీసీసీ నిర్మలనే వద్దన్నారని, దామోదర రాజనర్సింహ ఏది డిసైడ్ చేస్తే అదే ఫైనల్ అని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో అలిగిన వాడు బుద్ధి తక్కువ వాడని, అలిగిన వాని అంత బుద్ధి తక్కువ వాడు ఇంకోడు ఉండడని ఆయన అన్నారు.



