రోటరీ క్లబ్ సమావేశం
విశ్వంభర, వరంగల్:- రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ అధ్యక్షులు మడూరి గణేష్ ఆధ్వర్యంలో రత్న హోటల్ నందు రోటరీ క్లబ్ కుటుంబ సభ్యుల మధ్య కొత్తగా సభ్యులైన డాక్టర్ అవినాష్ ,క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సుజీత్ RMO, ములుగు వ్యాపారస్తులు శ్రవణ్ కుమార్ ,పొట్టి రాజేష్ ,వారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ శరత్ బాబు మాడూరి గణేష్ గార్లూ ప్రమాణస్వీకారం తో పాటు రోటరీ పిన్ అందిస్తూ ఫ్రెండ్షిప్ ఫెలోషిప్ అండ్ సర్వీస్ అనే ' నినాదంతో 120 సంవత్సరాల క్రితం ప్రారంభమైన రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వివిధ రంగాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలబడింది ప్రపంచం మొత్తం 1.4 (14 లక్షల మంది) మిలియన్ మెంబర్షిప్ తో ప్రజలకు సేవా కార్యక్రమాలు. డిసైజ్ ప్రెవేన్షన్ లో భాగంగా ప్రపంచానికి పోలియో ని ఎరాడికేట్ చేయడంలో రోటరీ క్లబ్ కీలక పాత్ర పోషించింది.ప్రపంచాన్నించి పోలియో మహమ్మారి దూరమవడంలో రోటరీ యొక్క కృషి మర్చిపోలేని ది పోలీయ్ ఏరాడికేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 2011 వరకే దాదాపుగా ఒక బిలియన్ డాలర్ల రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ ఖర్చు చేయడం జరిగింది.1988లో 225 దేశాలలో ఉన్న పోలియో ఇప్పుడు కేవలం రెండు దేశాలకే పరిమితం లో రోటరీ పాత్ర తనవివిధ రంగాలలో రోటరీ క్లబ్ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవలు నిజంగాఎంతోఅభినందనీయం.. కోవిడ్ నియంతనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో రోటరీ క్లబ్ సేవలు అందించింది ..భారతదేశంలో కూడా దాదాపుగా350కోట్లరూపాయల వరకు కోవిడ్ నివారణలో భాగంగా సహాయం చేయడం జరిగింది. దేశంలో వివిధ ప్రాంతాలలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎన్నో పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఇచ్చి వారి ప్రాణాలను నిలపడంలో రోటరీ క్లబ్ ఎంతో సేవ చేసింది... మన వరంగల్ పట్టణంలో కూడా మన ఈ క్లబ్ రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ రొటీరియన్లు ఎంతో ముందుకు వచ్చి 25 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు డాక్టర్ శరత్ బాబు గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచింది వారి ప్రాణాలు కాపాడడంలో కృషి చేసింది... ఇదే కాకుండా ఎన్నో గ్లోబల్ గ్రాండ్స్ ద్వారా పేద ప్రజలకు విద్యా వైద్యం మరియు శానిటేషన్ ఇలాంటి ప్రథమ హక్కులను అందించడంలో రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది.. వరంగల్ సెంట్రల్ వారు విజన్ సెంటర్స్ మొదలుపెట్టి భూపాలపల్లి జనగాం జిల్లాలో ఉచిత కంటి నిర్ధారణలు మరియు అనుకూలమైన చికిత్సలు చేస్తున్నారు పేద ప్రజల కోసం స్వచ్ఛమైన నీరు కోసం వాటర్ ప్లాంట్స్ నిరుపేదలైన ప్రజలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్లు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న ఆడపిల్లలకి సైకిల్స్ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కోసం ప్రోటీన్ పౌడర్స్ మరియు రాబోవు రోజుల్లో ఎంజీఎం హాస్పిటల్ నందు నెలలు నిండని ఆంగా వైకల్యంతో పుట్టిన పిల్లలకు నూతన ఎక్యుమెంట్ (NICU) రోటరీ క్లబ్ వరంగల్ సెంట్రల్ ద్వారా ఉచితంగా అందిస్తూ అమెరిక నుండి డాక్టర్స్ వచ్చి ఇక్కడ ఉన్నవారికి ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలు చనిపోకుండా ఉండేవిధంగా శిక్షణ ఇవ్వబడుతుంది అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించుచున్నాము ఈ కార్యక్రమంలో నూతనంగా వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్లు గా మా క్లబ్ సభ్యులు ప్రముఖ న్యాయవాది చకిలం ఉపేందర్ ,తోట జగన్నాథం ,పొన్న హరినాథ్, వద్నాల సదానందం ఎన్నుకోబడిన వారిని ఈ కార్యక్రమంలో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో Rtn‘s కోరే చంద్రమౌళి ,బేతి అశోక్ బాబు , జూలూరి కృష్ణమూర్తి తోట సంపత్ ,బండారి కుమారస్వామి ,రాజేందర్ కిరణ్, పోరండ్ల రత్నాకర్, ప్రసాద్, రవీందర్, వినయ్ , దేవమహేందర్ ,చిన్నాల సత్యనారాయణ, బేతిశంకరయ్య, వేణు, తోట శివకుమార్, రోటరీ మిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



