ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి: డీవైఎఫ్‌ఐ
విశ్వంభర, ముషీరాబాదు : నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఖాళీ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. హైదరాబాదు ముషీరాబాదు సీఐటీయూ నగర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ 21వ జిల్లా మహాసభలో ఆనగంటి వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. సమగ్ర జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరారు. ఉద్యోగాలు కల్పించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాజీవ్ యువ వికాస్ పథకం కింద అర్హులైన ప్రతి నిరుద్యోగికి స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో సుమారు 20 వేల ఖాళీలు ఉన్నప్పటికీ 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ప్రకటించడం సరైన నిర్ణయం కాదని, అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి ఎం.డి. జావీద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న సుమారు పది లక్షల ఖాళీలు, దేశవ్యాప్తంగా ఉన్న 60 లక్షలకు పైగా ఖాళీ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభ ప్రారంభంలో జిల్లా అధ్యక్షుడు హస్మి బాబు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో: మాజీ డివైఎఫ్ఐ నాయకులు మహేందర్ విజయ్ కుమార్ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి జిల్లా కార్యదర్శి లెనిన్ డీవైఎఫ్‌ఐ నాయకులు అనిల్ కుమార్ దేవేందర్ రాజయ్య సునీల్ వేణు శ్రీనివాస్ అన్వేష్ కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు.