బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కేఎల్ఆర్

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన కేఎల్ఆర్

 విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలోని  శివగంగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సందర్శించారు. త్వరలో జరగనున్నబ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను తరపున పరిశీలించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ ఆల్లె కుమార్ ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణం సహా ఇతర నిర్మాణాలు చకచకా జరుగుతున్నాయని కే ఎల్ ఆర్ చెప్పారు. ఆలయాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్ డి ఎఫ్  దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి నిధులను కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహకరంతో వచ్చాయని ఆలయ ఛైర్మన్ ఆల్లె  కుమార్ తెలిపారు. మహాశివరాత్రి,బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు చేయాలని లక్ష్మారెడ్డి పలు సూచనలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉండే అయ్యప్ప భక్తులకు కొత్త సన్నిదానం నిర్మాణానికి  సహకరిస్తానని కె.ఎల్.ఆర్   హామీ ఇచ్చారు. శ్రీ శివగంగా రాజరాజేశ్వరి ఆలయంతో పాటు అక్కన్న మాదన్న ప్రాంగణాలను తిర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టికితీసుకెళ్తానని  ఆయన  తెలిపారు. ఈ కార్యక్రమంలో  మహేశ్వరం పట్టణ కాంగ్రెస్ నాయకులు, ఆలయ ఈఓ మురళీకృష్ణ.ఆలయ కమిటీ సభ్యులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags: