స్వచ్ఛతే ఆరోగ్యానికి బాట
విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 'సఫాయి అప్నా.. బీమారీ భగావో ' కార్యక్రమాన్ని శనివారం 2వ వార్డులో నిర్వహించారు. పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు ఇళ్ల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిల్వ నీటిని వెంటనే తొలగించడం, పాత టైర్లు, కుండలు, డ్రమ్‌లు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించవచ్చన్నారు. అలాగే ప్రతి ఇంటిలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనానికి అందించాలని కోరారు. ప్రజలందరూ పరిశుభ్రతను అలవర్చుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగు లత, కొండ రజిత, తిరుపతి, పూదరి వరప్రసాద్ గౌడ్, కేశవేణి రమేష్, బొల్లి శ్రీనివాస్, కిరణ్ ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రవికుమార్, జవాన్లు సారయ్య, శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.