మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి సన్మానం
విశ్వంభర, అనంతగిరి: అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయిన ముసుకు శ్రీనివాసరెడ్డి కి ఆదివారం మండల పరిధిలోని వాయిల సింగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లు సుబ్బారావు మాట్లాడుతూ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ముసుకు శ్రీనివాసరెడ్డినీ రెండవసారి ఏకగ్రీవంగా ఎంపిక చేసినందుకు కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.అయన ఎంతో సౌమ్యులనీ మృదుస్వభావి అయిన శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో రానున్న ఎంపిటిసి ,జెడ్పీటీసీ, సింగిల్ విండో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందనీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముసుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననితనపై నమ్మకం ఉంచి రెండవసారి మండల పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక చేసిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గద్దె రాంబాబు, మేళ్ళచెర్వు చిన బిక్షం ,తదితరులు పాల్గొన్నారు.