మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విజేతలకు సర్టిఫికెట్స్ ప్రధానం. -బిఎన్.రెడ్డి డివిజన్ టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్ మరియు సామాజికవేత్త గద్దె విజయ్ నేత
On
విశ్వంభర, బి ఎన్ రెడ్డి నగర్ :- మేడ్చల్ జిల్లాలో జరిగిన వాకో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మన బి.ఎన్.రెడ్డి డివిజన్లోని మాస్టర్ ఫిట్నెస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుండి గెలుపొందిన స్టూడెంట్స్ కు బి.ఎన్.రెడ్డి డివిజన్ టిడిపి కాంటెస్టెడ్ కార్పొరేటర్, సామాజికవేత్త గద్దె విజయ్ నేత చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెమొంటోళ్లు అందించారు. గద్దె విజయ్ నేత సహకారంతో బెస్ట్ పర్ఫామెన్స్ స్టూడెంట్స్కు బాక్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్ సతీష్ రెడ్డి, శివ, వెంకట్, స్టూడెంట్స్ నాగపంతి, ఆనంద్, గంగ, ధీరజ్, శ్రీధర్, అర్జున్ రెడ్డి, శివ మొదలు వారు తదితరులు పాల్గొన్నారు.



