ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
విశ్వంభర, మర్పల్లి :- గ్రామస్తులు అందరి సహకారంతోనే బాల్యవివాహాలతో పాటు బాల కార్మికుల నిర్మూలన సాధ్యమవుతుందని మర్పల్లి ఎస్సై అబ్దుల్ రాహుఫ్ సిరిపురం హాస్టల్ సంక్షేమ అధికారి తుల్జారాం గౌడ్ పేర్కొన్నారు. బాల్య వివాహాలు నిర్మూలనకు గ్రామస్తులందరూ సహకరించాలని పేర్కొన్నారు. మంగళవారం మర్పల్లి మండలం లోని తుమ్మలపల్లి గ్రామంలో సర్పంచ్ కె రాజు అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కె రాజు మాట్లాడుతూ గ్రామస్తులందరూ కలిసి మెలిసి ఉంటామని కులమతాలకు అతీతంగా అందరిని ప్రేమ భావాలతో కలిసి మెలిసి ఉండాలి అన్నారు. మర్పల్లి మండలం జి పి ఆర్ ఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన మహిళలకు వివాహాలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ చట్టం వాళ్ళవి వివాహాల నిరోధక చట్టం వంటి వాటిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని వారు అన్నారు. ఈ సమావేశంలో గ్రామ కార్యదర్శి సుజాత ఉపసర్పంచ్ సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు



