సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం

విశ్వంభర, కమాన్‌పూర్:సిద్ధిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శాలపల్లి లో ఈజీఎస్  నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ బంగారు కళ్యాణి మహేష్, ఉపసర్పంచ్ కొత్తపల్లి సతీష్ శనివారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో మంజూరైన నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.శాలపలి లో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రజలకు మెరుగైన రాకపోకల సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొత్తపల్లి సతీష్, గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్,వార్డు సభ్యులు బిల్లా వెంకటేష్ , మోర అనూష ప్రశాంత్, కొలిపాక వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చిప్ప రాజకుమార్, నరేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cc-road-construction-works-started/article-18903

Tags: