సుందరయ్య జీవితాన్ని నేటి తరం  ఆదర్శంగా తీసుకోవాలి

  • సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు 

విశ్వంభర, మోత్కూరు :  పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై,  నిర్వహించే సమరశీల పోరాటలే కామ్రేడ్ సుందరయ్యకు ఘన నివాళని, నేటితరం ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు అన్నారు. మంగళవారం  మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో  కామ్రేడ్ సుందరయ్య  41వ  వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సుందరయ్య జీవితాన్ని  నేటితరం ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. సుందరయ్య జీవితం అంటే  కేవలం ఆదర్శం కాదని, ఆచరణ, నిబద్దత వర్గపోరాటాలతో  పాటు సామాజిక ఉద్యమాలకు ప్రేరణ ఇచ్చిన గొప్ప పార్లమెంటేరియాన్ అని , ప్రజా జీవితంలో  ప్రజా ప్రతినిధి అంటే  ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే గొప్ప ఆయుధమని చాటి చెప్పిన నాయకుడని అన్నారు. నేటీ రాజకీయాలు  ప్రజాసేవకంటే  స్వార్థం, సంపాదన, బందుప్రీతి లాంటి అంశాలతో కలుషితం అయ్యాయని, ప్రజా సమస్యలను మరచిన నాయకులు  పదవి వ్యామోహంతో  డబ్బు మద్యం లాంటి  వాటికి ప్రజలను  అలవాటు చేస్తున్నారని విమర్శించారు. నేటితరం  సుందరయ్య జీవితాన్ని, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని అర్ధం చేసుకొని ఆచరణలో పెడితే, సమాజానికి మేలు జరగడమే కాక, మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కురిమేటి యాదయ్య, మెతుకు సాయిలు, కురిమేటి సోమయ్య, బండి రవి, రాచకొండ శ్రీశైలం, చిరుమర్తి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/todays-generation-should-take-sundaraiahs-life-as-an-example/article-15456

Tags: