కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈనెల 11న కామ్రేడ్ చర్కక జగన్నాథం, కాచం కృష్ణమూర్తి కార్యాలయంలో సిపిఐఎం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎండి జహంగీర్ ఆదేశాల మేరకు రామన్నపేట మండలం, మునిపంపుల గ్రామానికి చెందిన మేడిముకుందం వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కందుల హనుమంతును, ఉపాధ్యక్షులుగా నాగటి లక్ష్మణ్, శానకొండ వెంకటేశం, వేముల సైదులు, సహాయ కార్యదర్శిగా కొమ్ము అంజయ్య, అవనగంటి నాగేశ్, ఉండ్రాతి నరసింహ, బొడిగె రజిత, కమిటీ సభ్యులుగా పిట్టల పద్మ, వలమల్ల నరసింహ, ఎడ్ల ధనమ్మ, బుర్ర సత్తమ్మ, దండిగా నరసింహ, బలుగూరి అంజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండమడుగు నరసింహ, బొల్లు యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లల పెంటయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు రాములమ్మ, సిరిపాంగి స్వామి తదితరులు పాల్గొన్నారు

Tags: