జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి దక్కేదెవరికో
On
విశ్వంభర, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి గత 2½ సంవత్సరాలుగా ఖాళీగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని, ప్రజల విద్యా అభివృద్ధికి కీలకమైన ఈ పదవిని వెంటనే భర్తీ చేయాలని జిల్లా ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ప్రస్తుతం ఈ నియామకంపై ఓసీ,బీసీ వర్గాల మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో,సామాజిక న్యాయం , సమాన అవకాశాల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బీసీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున, ఇలాంటి నామినేటెడ్ పదవుల ద్వారా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.



