నెల్లికుదురు మండలంలో గ్రామ సభలు
విశ్వంభర, నెల్లికుదురు: ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఎస్సై చిర్ర రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచ్ ల అధ్యక్షతన అరైవ్ అలైవ్ పై అవగాహన గ్రామసభలు సోమవారం నిర్వహించారు. 31 గ్రామ సభలకు పోలీసులు హాజరయ్యారు. పలు గ్రామాలలో ఎస్సై రమేష్ బాబు పాల్గొని రోడ్ సేఫ్టీ పై ప్రజలకు పలు సూచనలు చేశారు. 100% హెల్మెట్స్ ధరించాలన్నారు.లైసెన్సులు కలిగి ఉండాలని, మైనర్లకు బైకులు ఇవ్వవద్దని సూచించారు. కార్ల లో ప్రయాణించేవారు సీటు బెల్టులను ధరించాలన్నారు. అధిక వేగం వద్దన్నారు.భద్రతా నియమాలు పాటిస్తూ కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ గ్రామాల్లో సర్పంచులు పలు సూచనలు చేశారు. ఆయా గ్రామాలలో పంచాయితీ కార్యదర్శులు ఉప సర్పంచ్ లు,వార్డు సభ్యులు,అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు హాజరయ్యారు.



