పొర్లు దండాల యాత్ర చేసినా  కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరు

పొర్లు దండాల యాత్ర చేసినా  కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరు

  • ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

విశ్వంభర, హైదరాబాద్: బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చినా సాధించేదేమీ లేదని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. గాంధీ భవన్ లొ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా తెలంగాణ ప్రజలు వాళ్ళకి వీఆర్ఎస్ ఇచ్చేశారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కుట్రల కుటుంబం అన్నారు. పదేండ్లు తెలంగాణ అమరులను, ప్రజాసంఘాలను, ఉద్యోగ సంఘాలను గోస పెట్టారని విమర్శించారు. కొంగ జపం చేస్తున్న కేటీఆర్ గత పదేండ్లు ప్రజలనే కాదు సొంత పార్టీ నేతలను పట్టించుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి ఆకాశం లాంటి వాడని, ఆకాశంపై ఉమ్మేస్తే వాళ్ళ మొహంపైనే పడుతుందన్నారు. పాదయాత్ర కాదు పొర్లు దండాల యాత్ర పెట్టినా కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరని ఏద్దేవా చేశారు. కేటీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు

Tags: