ప్రధాని నివాసం ముట్టడి ఘటనను ఖండిస్తూ కమాన్‌పూర్‌లో బీజేపీ నిరసన

విశ్వంభర, కమాన్‌పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించే ప్రయత్నాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కమాన్‌పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు కొయ్యడ సతీష్ మాట్లాడుతూ, దేశ ప్రజల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. అలాంటి సమయంలో ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. దేశ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, నిరసన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధమైన పరిమితుల్లోనే జరగాలని పేర్కొన్నారు. ప్రధాని నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు చేపట్టడం తగదని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యలను ప్రజలు సమర్థించరని, భవిష్యత్తులో కూడా బీజేపీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే స్పందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము, సీనియర్ నాయకులు మట్ట శంకర్, జంగపల్లి అజయ్, మల్లారపు అరుణ్, మండల ప్రధాన కార్యదర్శి పంతకాని విశ్వతేజ్, పెద్దపల్లి శ్యాంసుందర్, మండల ఉపాధ్యక్షుడు పిల్లి చంద్రయ్య, సదానందం, కార్యదర్శి అగ్గి శ్రావణ్, సంపత్, శ్రీమన్, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-protest-in-kamanpur-condemning-the-siege-of-prime-ministers/article-19528

Tags: