ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు - తెలిపిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
On
విశ్వంభర, హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని ఆమె నివాసం లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలుతెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నీళ్ళు నిధులు నియామకాలపై నడుస్తుంటే దానికి భాష, యాస, అస్తిత్వాన్ని జతకలిపి జాగో అన్న శక్తి అని ఎమ్మెల్సీ కవిత అని కొనియాడారు. తెలంగాణ సబ్బండ కులాల సమస్యలకు శాసనమండలిలో గొంతెత్తి, తెలంగాణ ప్రశ్నించే గొంతును అణచివేయాలని ఆరాటపడ్డ చిల్లర మూకల చిటపటలను చిదిమేసి ఎగిసిన కెరటమని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని తెలిపారు.