బీసీ గర్ల్స్ హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలి
విశ్వంభర, భూపాలపల్లి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనపూర్ మండల కేంద్రంలో ఉన్న బీసీ గర్ల్స్ హాస్టల్ ను ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి రాజు సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు స్వయంగా తెలుసుకోవడం జరిగింది. హాస్టల్ కు సంబంధించి గత కొన్ని నెలలుగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి తీసుకువచ్చారని, అదేవిధంగా బీసీ గర్ల్స్ హాస్టల్ లో విద్యార్థు లు 50 మందికి పైగా ఉన్నారు. హాస్టల్లో ఉంటున్న సమయంలో వర్షాకాల ప్రభావంతో గోడలు కూలిపోవడం జరిగింది అదేవిధంగా వర్షాలు కొట్టిన తర్వాత బిల్డింగ్ షాక్ వచ్చి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని అన్నారు . హాస్టల్ కు సంబంధించి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. లేనియెడల విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని వారు హెచ్చరించారు.