'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' ప్రారంభం
విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి - బి ఎల్ ఆర్ , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు, వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష నవీన్ , మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ఈ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కౌన్సిలర్స్ కి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



