పింఛన్ల పంపిణీ

పింఛన్ల పంపిణీ

విశ్వంభర,  రాప్తాడు : రాప్తాడు మండలం బండమీద పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు, మండల ఇంచార్జ్ ధర్మవరపు మురళి సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరపు మురళి మాట్లాడుతూ , కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే సచివాలయ సిబ్బందితో కలిసి  లబ్ధిదారుల  ఇంటి వద్దకు వెళ్లి అదజేశామని చెప్పారు. ఇంకా ఎవరికైనా అందని వారు ఉంటే సోమవారం తీసుకోవచ్చ ని తెలిపారు. ఈ  కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు జనరల్ సెక్రటరీ. వెంకటరాముడు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews