గాలివాన బీభత్సం...కూలిపోయిన రేకుల ఇంటి పైకప్పు..

గాలివాన బీభత్సం...కూలిపోయిన రేకుల ఇంటి పైకప్పు..

  • ఆదుకోవాలని బాధితుల మొర 

విశ్వంభర, శంషాబాద్:  శంషాబాద్ మండల పరిధిలోని   వివిధ గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో చౌదర్ గూడ గ్రామపంచాయతీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో నివసిస్తున్న పోగుల నీరజ మల్లేష్ అప్పుచేసి నూతనంగా నిర్మించుకున్న రేకుల ఇల్లు పైకప్పు కూలిపోవడంతో కన్నీటి పర్వతమయ్యారు. ఆరు లక్షలకు పైగా అప్పు చేసి ప్లాట్ కొన్నామని అనంతరం 15 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం చేసుకున్నామని వర్షం కారణంగా ఇంటి పైకప్పు రేకులు కూలిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. రోజు కూలీ పని చేసుకుంటూ తమకు ఉన్న ఇద్దరు ఆడపిల్లలతో కలిసి జీవిస్తున్నామని చెప్పారు. రెక్కాడితే కానీ డొక్కాడని మాకు ఇంట్లోకి నీరు చేరడంతో తినడానికి తిండి కూడా లేకుండా పూర్తిగా అన్ని వస్తువులు వర్షం కారణంగా తడిసి ముద్దయ్యాయని వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని  వేడుకున్నాడు. అకాల వర్షం కారణంగా  ఇంద్రారెడ్డి కాలనీలో కూలిపోయిన ఇంటి బాధితుల వద్దకు గడ్డం శేఖర్ యాదవ్,  కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జలపల్లి నరేందర్ తో కలిసి వెళ్లి పరిశీలించి బాధితులకు మనోధైర్యాన్ని కల్పించారు.  గడ్డం శేఖర్ యాదవ్ అనంతరం బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామని వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఇంటి నిర్మాణం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తానని భరోసా కల్పించారు

Tags: