ప్రత్యేక న్యాయవిజ్ఞాన అవగాహన సదస్సు

ప్రత్యేక న్యాయవిజ్ఞాన అవగాహన సదస్సు

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని ఎన్నారం, మునిపంపుల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు న్యాయవిజ్ఞాన అవగాహన సదస్సు  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జూనియర్ సివిల్ జడ్జి శిరీష, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రత్నకుమారి కార్యక్రమాన్ని ఉద్దేశించి  మాట్లాడుతూ, విద్యార్ధులు ముఖ్యంగా అన్ని రంగాలలో ముందు ఉండాలన్నారు. విద్యా వ్యవస్థ వల్లనే ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంటదని, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే పరిష్కారం దిశగా అడుగులు  వేయాలని సూచించారు. అందరికీ పలు రకాల చట్టాలపై అవగాహన పొందాలని, విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్యవివాహాలు, ఫోక్సో చట్టం, లేబర్ చట్టాలు, మాదక ద్రవ్యాలు, అన్ని రకాలుగా ఎలాంటి సమస్య వచ్చిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు పాఠశాలలో గాని, వచ్చి వెళ్ళే దారిలో ఆకతాయిల వల్ల గాని ఏమైనా సమస్య అనిపించిన వెంటనే పాఠశాలలో ఏర్పాటు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కి గానీ, స్థానిక పోలీస్ స్టేషన్ లలో గానీ, మండల స్థాయిలో ఉన్న న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి గాని తీసుకురావాలని, ఎవరు కూడా అధైర్య పడవద్దని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్ది వేరే బయటి ఆలోచనలు పెట్టుకోకుండా, పుస్తకాలు చదవడం మీదనే దృష్టి పెట్టాలి, చెడు దారి పట్టించే ఆలోచనలు పక్కకి నెట్టేసి, ఏమి ఆలోచనలు చేసిన మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని అన్నారు. సమాజం పట్ల మంచి అవగాహనతో ఉండాలన్నారు. సమాజంలో మన హక్కులు,బాధ్యతలు నిర్వహణలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎంఏ మజీద్, యాదాస్ యాదయ్య, కునూరు శ్రీనివాస్, పాల్వంచ జగతయ్య,  ఏజిపి సుక్క శ్రవణ్, నూతి రమేష్, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్దులు పాల్గొన్నారు

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-jurisprudence-awareness-conference/article-19707

Tags: