పరిగి అభివృద్ధికి మరో మైలురాయి  రూ.185 కోట్ల హ్యామ్ రోడ్ల పనులకు శ్రీకారం

  • రూ.185 కోట్ల రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రులు,ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన

విశ్వంభర,పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్ గేట్ వద్ద రూ.185 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యామ్  రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు  భవనాల శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి  వికారాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఎమ్మెల్సీ  పట్నం మహేందర్ రెడ్డి ,పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన చేశారు. అనంతరం సుల్తాన్‌పూర్ గేట్ నుంచి ఏబీఎస్ ప్లాజా వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అనంతరం పరిగి పట్టణంలోని ఏబీఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పీఏసీఎస్  నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం  కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం,అభివృద్ధి కార్యక్రమాల అమలు,ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంపై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడని అధికార పక్షంలో ఉండి పరిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పరిగి నియోజకవర్గానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాలను అనుసంధానం చేసే నాలుగు లైన్ల రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రాఘవపూర్ నుండి నంచర్ల వరకు నాలుగు లైన్ల రహదారి మంజూరు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. భవిష్యత్తులో పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కులో ఐటీ క్యారిడార్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పరిశ్రమలు ఐటి రంగాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 10 సంవత్సరాల బి.ఆర్.ఎస్ పాలనలో ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం పరిగి మున్సిపాలిటీలో కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న మల్లేష్ గ్రూప్ వన్ ఉద్యోగం సాధించడం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నియమాకాల ఫలితమేనని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే గ్రూప్ వన్ ఉద్యోగాలు నియామక ప్రక్రియ ముందుకు సాగింది అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి మరోసారి గణ విజయం సాధించడం ఖాయమని తెలంగాణలో తిరిగి అధికారంలో ని కి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిగి నియోజకవర్గానికి రోడ్లు భవనా ల శాఖ ద్వారా ఇంత భారీ స్థాయిలో నిధులు రావడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తెలంగాణలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ,డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ ,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి , ఎస్పీ స్నేహ మెహ్రా ,మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత వెంకటేష్ , పిఎసిఎస్ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, జిల్లా అధికారులు,పరిగి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/another-milestone-for-the-development-of-parigi-is-the-commencement/article-18913

Tags: