ఎల్ నినో, నర్సరీ చట్టంపై  అవగాహన

ఎల్ నినో, నర్సరీ చట్టంపై  అవగాహన

విశ్వంభర, మహబూబాబాద్: కురవి మండల రైతు వేదికలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నర్సరీదారులకు ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఎల్ నినో పరిస్థితులు, నర్సరీ చట్టం, నాణ్యమైన నారు ఉత్పత్తిపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితులకు అనుగుణంగా స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసి, లైసెన్స్ పొందిన నర్సరీల్లోనే నాణ్యమైన నారును పెంచాలని సూచించారు. నర్సరీ చట్టాన్ని ఉల్లంఘించి నకిలీ విత్తనాలు, నారు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన శాస్త్రవేత్త డా. ఎ. ప్రశాంత్, ఉద్యాన శాస్త్రవేత్త ఎల్. సుహాసిని భూసార పరీక్షలు, నీటి సంరక్షణ, షేడ్‌నెట్, మల్చింగ్, చీడపీడలను తట్టుకునే కూరగాయలు, పూల పంటలు, నిమ్మగడ్డి సాగుతో పాటు మార్కెట్ డిమాండ్ ఉన్న ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు చేశారు. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్లాస్టిక్ మల్చింగ్, బిందు సేద్యం, నీటి కుంటలు, కూరగాయల పందిర్లపై రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, నర్సరీదారులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/an-understanding-of-the-el-ni%C3%B1o-nursery-law/article-19549

Tags: