సామాజిక, ఆర్థిక పోరాటాలు కలిసే సాగాలి : పాలడుగు భాస్కర్

సామాజిక, ఆర్థిక పోరాటాలు కలిసే సాగాలి : పాలడుగు భాస్కర్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: కార్మిక వర్గ ఐక్యతకు అడ్డంకులు తొలగించాలంటే సామాజిక, ఆర్థిక పోరాటాలు కలిసే సాగాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వ్యవక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి స్కైలాబ్ బాబు అధ్యక్షత వహిస్తూ కుల వివక్ష ఇంకా సమాజంలో కొనసాగుతుండటం ఆందోళనకరమన్నారు. సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆవాజ్ అబ్బాస్ మాట్లాడుతూ మనువాద భావజాలం సమాజంలో విభజనలను పెంచుతోందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాం నాయక్, వహీద్, ఆదమరాజు, రవీందర్, వెంకటేష్, అంజన్న, సృజన, రాములు, ధనలక్ష్మి, కృపాసాగర్, బాలపీరు, సుబ్బారావు, మహేందర్, ప్రకాష్, మద్దిమడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: