ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
On
విశ్వంభర, చింతపల్లి : చింతపల్లి మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో స్పెషల్ క్లాసుల పేరుతో సెలవు రోజులలో కూడా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేవరకొండ డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ శంశోద్దిన్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన సాంకేతిక విద్యను అందించాలని అన్నారు. తక్షణమే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ జావిద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



