బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి:ఎసీడీపీవో సమీరా
విశ్వంభర, రామన్నపేట: గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని రామన్నపేట ఎసీడీపీవో సమీరా అన్నారు. యదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిడిపిఓ సమీరా గర్భిణీలు, బాలింతలకు న్యూట్రిషన్ పై అవగాహన కల్పించారు. గర్భవతులు, బాలింతలు ఆరోగ్య సూచనలు పాటించాలని సూచించారు. అనంతరం తల్లులకు ఫుడ్ పోటీలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎంలు సాదియా, మంజుల, అంగన్వాడి టీచర్లు, ఆశాలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.