అంగన్వాడీలను పరిశీలించిన కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి 

అంగన్వాడీలను పరిశీలించిన కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి 

విశ్వంభర, ముషీరాబాదు : నగరంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గురువారం అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీలోని అంగన్వాడీ కేంద్రం, బస్తీ దవాఖానాలను ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులతో అక్షరాభ్యాసం, అన్నప్రసన్నం  నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ విద్యుత్, టీవీ, ఆటబొమ్మలు, పౌష్టికాహారం, మరుగుదొడ్ల వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందికి శిక్షణ అందించి సేవలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. బాలికల సంరక్షణ కోసం ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నామని వివరించారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా బస్తీ దవాఖానాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి, అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు సాయికృష్ణ యాదవ్, మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, జిల్లా కార్యదర్శి రమేశ్, రాష్ట్ర నాయకులు శేషసాయి, నందు, పార్టీ సీనియర్ నాయకులు ఎం. నవీన్ గౌడ్, గడ్డం నవీన్, నరేష్, సికింద్రాబాద్ ప్రాజెక్టు సీడీపీవో స్వప్న, సూపర్వైజర్ తిరుమల, అంగన్వాడీ టీచర్లు అనురాధ, శారద తదితరులు పాల్గొన్నారు.

Tags: