23 నుంచి సిటీ పోలీస్ యాక్ట్
On
విశ్వంభర, సిద్దిపేట: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 23తేదీ నుంచి వచ్చేనెల 8వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పారు. కార్యక్రమాల నిర్వహణకు ముందస్తుగా సంబంధిత ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసేయాలని బెదిరింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా భారీ సౌండ్లతో కూడిన డీజే వినియోగంపై నిషేధం విధించినట్టు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు



