నీరు కారుతున్న ప్రభుత్వ లక్ష్యం

6

విశ్వంభర కూకట్ పల్లి జులై 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కెపిహెచ్బి కాలనీలోని పలుచోట్ల గార్బేజ్ పాయింట్లను ఎంచుకొని మొక్కలు నాటింది. గార్బేజ్ పాయింట్ల వద్ద చిత్తవేయకుండా ఉండడంతోపాటు పచ్చదనం పెంచేందుకు, ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆలోచన చేయడంతో ప్రారంభమైంది. కానీ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన, పాయింట్ వద్ద స్థానిక వ్యాపారులు మొక్కల చెత్తను పారవేస్తూ జిహెచ్ఎంసి అధికారులకు సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన కొందరిలో మార్పు రావడం లేదు. జిహెచ్ఎంసి అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే గాని పరిస్థితి మారదు అన్న చందంగా కొన్నిచోట్ల కనిపిస్తుంది. ఒకే రోజులో మొక్కలు నాటిన ప్రాంతంలో చెత్త వ్యర్ధాలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం జరుగుతున్నాయి. అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు సైతం ముక్కున మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్ల పక్కన చెత్త పేరుకుపోవడంతో వాహనాలు కూడా నిమ్మదించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే ఫుట్ పాత్  ఆక్రమణలతో, గురవుతుంది. చెత్తాచెదారం వేయడంతో మరింత దుర్గంధంగా మారుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నాటిన మొక్కలను సంరక్షించి భావితరాలకు అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.

Read More జాబ్ మేళాలో 14 మంది ఎంపిక