రాజ్యాంగ రక్షణకు సిద్ధం కావాలి
On
విశ్వంభర, చిక్కడపల్లి : సూర్యనగర్‌లో వాల్మీకి మెహతర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం సుందరయ్య పార్క్ సమీపంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ఉద్యమకారుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ, రాజ్యాంగం సమానత్వానికి పునాది అని, ప్రజల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. మత విభేదాలను ప్రేరేపించే శక్తులను ప్రశ్నించాలని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు సమైక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జె. సురేందర్, మాచుకూరి వేణు, ఎస్. రాజేందర్, డి. సుభాష్, డి. అనిల్, ఎస్. శివ, రాజేందర్ టైసన్ తదితరులు పాల్గొన్నారు.



