నెల్లికుదురులో హౌసింగ్ చీఫ్ విజిట్

నెల్లికుదురులో హౌసింగ్ చీఫ్ విజిట్

విశ్వంభర, నెల్లికుదురు: మండల కేంద్రం నెల్లికుదురు లోని పూరి గుడిసెలు రేకుల ఇండ్లను హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ స్థానిక ఎంపీడీవో సింగారపు కుమార్ తో కలిసి శనివారం సందర్శించారు. గతంలో జరిగిన ప్రజా పాలన పురస్కరించుకొని నెల్లికుదురులో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పూరి పూరి గుడిసెలు,రేకుల ఇండ్లను హౌసింగ్ ఇంజనీర్ ఇంటింటికి తిరిగి ఇండ్ల పరిస్థితిపై ఆయా కుటుంబాలతో మాట్లాడి, వివరాలు సేకరించి, పూర్తిస్థాయిలో ఆరా తీశారు.వివరాలను అడిగి తెలుసుకున్నారు.సంబంధ గుడిసెలు రేకుల ఇండ్లను గతంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి, గ్రామైక్య సంఘాల వి ఓ లు, గెజిటెడ్ అధికారులు సందర్శించి పరిశీలించి నివేదికను అందజేయడంతో వీటిపై హౌసింగ్ చీఫ్ ఇంజనీరు విజిట్ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ టివి అబ్దుల్ హకీం,ఎ ఈ అనిల్ పంచాయతీ కార్యదర్శి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/housing-chief-visits-nellikuduru/article-19748

Tags: