జల సంచయ్-జన భాగీదారీ పై కళాజాత బృంద అవగాహన కార్యక్రమం
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో జల సంచయ్-జన భాగీదారీ కళాజాత బృంద అవగాహన కార్యక్రమం సుందర్ నగర్, ఆర్ అండ్ గెస్ట్ హౌస్ , బంగారుగడ్డ ప్రాంతాలలో మిర్యాలగూడ మున్సిపాలిటీ పురపాలక సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణమరియుజలసంరక్షణలో ప్రజల భాగస్వామ్యం యొక్కఆవశ్యకతనుతెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కళాజాత బృందం సాంస్కృతిక ప్రదర్శనలు, నినాదాలు మరియు చైతన్యవంతమైన కార్యక్రమాల ద్వారా ప్రజలకు జల సంరక్షణ సందేశాన్ని చేరవేసింది. ప్రజల నుండి, ముఖ్యంగా మహిళా సంఘాల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నీటినిపొదుపు చేద్దాం - భవిష్యత్తును కాపాడుకుందాం అనే నినాదంతో ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు, వర్షపు నీటి నిల్వ పద్ధతులపై అవగాహన కల్పించారు. జల సంచయ్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరు సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ మరియు కమిషనర్ శ్రీనివాస్ తో పాటు పురపాలక సంఘం అధికారులు,వార్డు కౌన్సిలర్లు, ఏ పీ డి,సి ఓ లు ఆర్ పి లు స్వయం సహాయక బృంద సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.