యువ సంగ్రామ సదస్సుకు భారీ సంఖ్యలో బోడుప్పల్ బిఆర్ఎస్ నాయకులు

విశ్వంభర, బోడుప్పల్: మేడ్చల్ మల్కాజిగిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సరూర్నగర్ లో జరిగిన యువ సంగ్రామ సదస్సుకు  బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. మాజీ జడ్పిటిసి మంద సంజీవరెడ్డి నేతృత్వంలో బోడుప్పల్, చెంగిచెర్ల డివిజన్ లలో నుంచి అనేకమంది యువకులు, నిరుద్యోగులు యువ సంగ్రామ సదస్సుకు కదం తొక్కారు. ఈ సందర్భంగా బోడుప్పల్ లోని అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్ళి పూలమాలలు వేసి నినాదాలు పలికారు. అనంతరం మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులను  మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నేటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని,  కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, మీసాల కృష్ణ, బొమ్మకు విశ్వనాధ్, చిగురు రవికుమార్, శ్రీహరి గౌడ్,కాటం రాజీరెడ్డి, యూత్ నాయకులు బంగారం శ్రీధర్ గౌడ్,, శ్రీకాంత్ యాదవ్, సామల మనోహర్ రెడ్డి, ఉప్పరి విజయ్, మైసగళ్ల శ్రీకాంత్, విప్లమ్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలు, యువకులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-large-number-of-boduppal-brs-leaders-attended-the-yuva/article-18909

Tags: