కేసముద్రంలో 90 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి

  • ఆక్రమణలపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని
  • ఎంసీపీఐ(సి) మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి డిమాండ్ 

విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 399/1లో ఉన్న సుమారు 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ (క్లాస్ స్ట్రగుల్) ఎంసీపీఐ(సి) మహబూబాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి మరిపెళ్లి మొగిలి, జిల్లా కమిటీ సభ్యుడు జాటోత్ బిచ్యా నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కేసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఎర్రయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేసముద్రం గ్రామం–మహమూద్‌పట్నం సరిహద్దుల్లో, కేసముద్రం–తొర్రూరు ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు దళారులు ఆక్రమించి, మొరం పోసి చదును చేసి అక్రమంగా ప్లాట్లుగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందన్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ భూమిని కేటాయించాలని కోరారు. భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి అన్ని ఆక్రమణలను తొలగించాలని, అక్రమంగా కొనుగోలు చేసే వారు మోసపోయే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించి అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/90-acres-of-government-land-in-kesamudru-should-be-distributed/article-18933

Tags: