జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి

అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తాం: 

టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా

విశ్వంభర, షాబాద్, : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే నిరంతరం  కృషి చేస్తుందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.మంగళవారం షాబాద్ మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే  విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... సమాజ శ్రేయస్సు కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కనీస సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లైన అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రెడిటేషన్ కార్డుల మంజూరు, కార్పొరేట్ వైద్యం అందేలా ఉచిత హెల్త్ కార్డుల పునరుద్ధరణ, కుటుంబాలకు భరోసానిచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా)సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులంతా విభేదాలు వీడి ఒకే తాటిపైకి వచ్చి యూనియన్‌ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా మాట్లాడుతూ ... మండల స్థాయి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ల సూచనల మేరకు ఈ నెల 20 నుండి జిల్లా వ్యాప్తంగా విస్తృత0గా పర్యటిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్నీ నియోజకవర్గ, మండల కమిటీలను ఈ సందర్బంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.జర్నలిస్టులపై ఎక్కడైనా దాడులు లేదా అక్రమ కేసులు నమోదైతే యూనియన్ తీవ్రంగా స్పందించి, లీగల్ సెల్ ద్వారా పూర్తి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో జర్నలిస్టుల కోసం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో చేవెళ్ల  నియోజకవర్గంలో హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శులు దారుగుపల్లి సత్యనారాయణ, సూర్యనారాయణ, రమేష్,ఈసీ సభ్యులు ఇలియాజ్ షరీఫ్,చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డిమోని యాదయ్య, షాబాద్ మండల మాజీ అధ్యక్షుడు పోనమోని రమేష్ యాదవ్, గోవర్దన్ రెడ్డి, కరుణాకర్ చారి, మల్లేష్  తదితరులున్నారు. 

షాబాద్ మండల టీయూడబ్ల్యూజే నూతన కమిటీ ఎన్నిక

Read More బకాయి జీతాలు చెల్లించి న్యాయం చేయాలి: నూకతోటి పెదకొండయ్య

నూతన అధ్యక్షుడిగా దర్పల్లి రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఏగూరి మల్లికార్జున్

షాబాద్ మండల టీయూడబ్ల్యూజే నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
కమిటీ మండల అధ్యక్షుడిగా దర్పల్లి రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఏగూరి మల్లికార్జున్, గౌరవ అధ్యక్షుడిగా నాగని రామచంద్రయ్య, ఉపాధ్యక్షులుగా కడమంచి నర్సింలు, ఉప్పు శ్రీనివాస్, పోనమోని వెంకటేష్ యాదవ్, జాయింట్ సెక్రటరీలుగా బర్క నరేందర్, ముక్కు లక్ష్మణ్, జానంపేట శివరాజ్ గౌడ్, కోశాధికారిగా పూర్ణచందర్ గుప్తా, ఈసీ మెంబర్లుగా చిలకమర్రి అనిల్, రాజేష్, మధు, రాజేందర్, రవి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.  నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/6a609a14f0955/article-19354

Tags: