ఉద్యమ జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలి

ఉద్యమ జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలి

  • తెలంగాణ ఉద్యమకారుల జాబితాలో చేర్చాలని టీయుడబ్ల్యూజే డిమాండ్

తొర్రూరు, విశ్వంభర : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి, వారికి తగిన గౌరవం, సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే-ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని తెలంగాణ అమరజ్యోతి వద్ద ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం, సంక్షేమంపై జర్నలిస్టులతో నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు కేవలం వార్తల ప్రసారానికే పరిమితం కాకుండా, ప్రజల ఆకాంక్షలు, ఆవేదన, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరించి ఉద్యమానికి నైతిక బలం చేకూర్చడంలో వారి పాత్ర విశేషమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న వివక్ష, సామాజిక-ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అన్యాయాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చిన ఘనత జర్నలిస్టులదేనని చెప్పారు. అనేక ప్రాంతాల్లో ఉద్యమకారులతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, నిరసనల్లో పాల్గొనడమే కాకుండా, పలు జేఏసీలకు నాయకత్వం కూడా వహించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జీలు చేయడం, కెమెరాలు ధ్వంసం చేయడం, వార్తా సేకరణను అడ్డుకోవడం, తప్పుడు కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి అనేక ఇబ్బందులు ఎదురైనా వారు వెనుకడుగు వేయలేదని తెలిపారు. పలువురు జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోవడం, యాజమాన్యాల ఒత్తిళ్లు ఎదుర్కోవడం, కొందరు రాజీనామాలు చేయాల్సి వచ్చినా ఉద్యమానికి అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుల ఎంపిక కమిటీ జర్నలిస్టుల సేవలు, త్యాగాలను పరిగణనలోకి తీసుకుని, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి ఉద్యమకారుల గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విరాహత్ అలీ విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం టీయుడబ్ల్యూజే ప్రతినిధులు తమ వినతిపత్రాన్ని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/movement-journalists-should-be-recognized/article-19290

Tags: