మునగనూర్ రెవెన్యూ పరిధిలో 12 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

  • – నిషేధిత జాబితాలో చేర్చాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి

విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, మునగనూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 44/2 , 44/4లో ఉన్న సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురైందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. శారదా దేవికి జీహెచ్ఎంసి 53,56 డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహ రెడ్డి తో కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం బూర నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, సి సి ఎల్ ఏ  ఇప్పటికే ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఈ భూములను వెంటనే నిషేధిత జాబితాలో చేర్చి, సంబంధిత రెవెన్యూ అధికారులు అక్కడ ప్రభుత్వ భూమి అని సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోసుపల్లి ప్రతాప్, నారాయణ యాదవ్, కొత్త రాంరెడ్డి, బచ్చిగళ్ల రమేష్, కొండ్రు పురుషోత్తం, యూసుఫ్ రెడ్డి, నోముల కార్తీక్ గౌడ్, మల్లెల ప్రేమ్ సాయి, కోలను రవీందర్ రెడ్డి, నందగిరి సురేష్, గుండ కృష్ణ, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/12-acres-of-government-land-under-munaganoor-revenue-is-alienated/article-19320

Tags: