ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
- పట్టణ ఇన్ స్పెక్టర్ వెంకట్
విశ్వంభర, సూర్యాపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ఈరోజు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని విద్యార్థులకు సూచించారు, ట్రాఫిక్ ఎస్ఐ యాదవెందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల తల్లిదండ్రులను చైతన్యవంతం చేయాలని అన్నారు. పోలీస్ కళా బృందం వారు పాటలతో రోడ్డు భద్రత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ SI యాదవేంద్ర రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యాదయ్య వైస్ ప్రిన్సిపల్ వాసు, మరియు ప్రసాద్,అధ్యాపక బృందం, పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ యల్లయ్య, సభ్యులు గోపయ్య, కృష్ణ, చారి, సత్యం గురులింగం ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు