అమరావతి ఛాంపియన్స్ క్రీడా పోటీలకు ఎమ్మెల్యే అమిలినేని శ్రీకారం

విశ్వంభర, కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం ప్రాంతంలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. సోమవారం కళ్యాణదుర్గం పట్టణంలోని కరణం చిక్కప్ప క్రీడా మైదానంలో నిర్వహించిన 'అమరావతి ఛాంపియన్స్' నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను అధికారులు, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 'డొక్కా సీతమ్మ' మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. చదువుతో పాటు క్రీడలపైనా విద్యార్థులు ఆసక్తి పెంచుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గత 20 ఏళ్లుగా విద్యార్థులకు అండగా నిలుస్తున్నామని, తనకు శక్తి ఉన్నంత వరకు వారి అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎస్సార్సీ ట్రస్ట్ తరఫున జిల్లా కలెక్టర్‌కు రూ.2 లక్షలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే పాలవాయి పాఠశాలను విద్యా నిలయంగా అభివృద్ధి చేసి, అక్కడ హాస్టల్ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు మరియు ఇంటర్ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు స్వంత నిధులతో అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-amilineni-initiates-amaravati-champions-sports-competition/article-19318

Tags: