3వ వార్డులో "సఫాయి అప్నా భీమారీ భగావో" కార్యక్రమం
విధ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని 3వ వార్డులో పురపాలక సంఘ చైర్‌పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో "సఫాయి అప్నా – భీమారీ భగావో " కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో కౌన్సిలర్ కొండ రజిత తో మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. మునిసిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని సూచించారు. నిల్వ నీటిని తొలగించడం ద్వారా డెంగ్యూ, మలేరియా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. పాత టైర్లు, కుండీలు, డ్రమ్‌లు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. స్వచ్ఛమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగు లత, కొండ రజిత, పిల్లి తిరుపతి,పూదరి వరప్రసాద్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండి.హసన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రవికుమార్, జవాన్ సారయ్య, శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.