రైతులపై మొసలి కన్నీరు కార్చొద్దు
విశ్వంభర, సిద్దిపేట: బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదని, ఇప్పుడు రైతుల పట్ల ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం అత్తు ఇమామ్ మాట్లాడుతూ 20వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాజెక్టును లక్ష కోట్ల రూపాయల అంచనాకు పెంచి కేసీఆర్ కుటుంబం కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ప్రజలు, రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర మీదని విమర్శించారు. అధికారం పోగానే రైతులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర మీది అయితే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కలిముద్దీన్, మార్క సతీష్, దాస అంజయ్య, వాహాబ్, గయాసుద్దీన్, బంక చిరంజీవి, విజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.