జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు చేపట్టాలి

  • రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్

విశ్వంభర, సూర్యాపేట: జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమర్థవంతమైన రోడ్డు భద్రత చర్యలు అమలు చేయాలని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జాతీయ రహదారులపై రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతను పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు బీహార్, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలు మాత్రమే అనుసరణ నివేదికలు సమర్పించాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా త్వరితగతిన నివేదికలు పంపాలని సూచించారు. జాతీయ రహదారులపై అనధికారిక పార్కింగ్‌ను పూర్తిగా నిరోధించాలని, పెట్రోలింగ్ వాహనాల నిర్వహణను బలోపేతం చేయడంతో పాటు భారీ వాహనాల కోసం అవసరమైన పార్కింగ్ స్థలాలను జాతీయ రహదారుల సమీపంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారుల అధికారులు, పోలీసు శాఖ, సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి వెంటనే తొలగించాలని, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే జాతీయ రహదారుల వెంట ఉన్న ఆసుపత్రులను మ్యాపింగ్ చేసి అత్యవసర వైద్య సేవలు వేగంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారుల పక్కన కొత్తగా మద్యం దుకాణాలకు ఎలాంటి లైసెన్సులు మంజూరు చేయరాదని స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న రహదారుల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యలపై సమగ్ర కార్యాచరణ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రత అంశాన్ని సుప్రీంకోర్టు అత్యంత నిశితంగా పర్యవేక్షిస్తోందని, ఈ విషయంలో అన్ని శాఖల సమన్వయం, పోలీసు సహకారం ఉండేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అనుసరణ నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణా శాఖ అధికారి పురుషోత్తం రెడ్డి, మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) నవీన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/coordinated-measures-should-be-taken-to-prevent-accidents-on-national/article-19312

Tags: