ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
విశ్వంభర, పరిగి: కుల్కచర్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పిఎసిఎస్ చైర్మన్ భీమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ.. కుల్కచర్ల మండల పరిధిలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన ఆలయ కమిటీ చైర్మన్ గా కోట్ల మహిపాల్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు ఈనెల 23న ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ ఎల్కిచర్ల సర్పంచ్ శ్రీనయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు