ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

  • మహమ్మదాబాద్ మండలంలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సమీక్ష

విశ్వంభర, పరిగి: మహమ్మదాబాద్ మండలంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డా. టి. రామ్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి ఓటరు వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అనంతరం మండలంలో అమలవుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై శాఖల వారీగా అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అన్ని అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పలువురు సర్పంచులు తమ గ్రామాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండల పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణ, డైరెక్టర్లు నరసింహారావు, నారాయణ, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-sir-process-should-be-transparent/article-19257

Tags: