ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు 

ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు 

విశ్వంభర, అంబర్‌పేట : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే 84వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదు బాగ్ అంబర్‌పేట డివిజన్ అధ్యక్షులు రావుల సుధాకర్ ఆధ్వర్యంలో భారత్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోత రోహిత్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంబూల శ్రీకాంత్ గౌడ్, గడ్డం శ్రీధర్, ఏదేలి ప్రభాకర్, కోటం అనిల్, రాజేశ్వర్ రావు, జమీర్, చంద్రశేఖర్, భరత్, సునీల్, రాకేష్, రోహన్, రాజ్‌కిరణ్, ప్రదీప్, బాలు, కిరణ్, మొజ్, సైఫ్, సలీం, ఫెరోజ్, శంకర్, సందీప్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-birthday-to-kharge/article-19271

Tags: