రామన్నపేటలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బి.ఎల్.ఏలతో సమీక్ష సమావేశం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై బీఎల్‌ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల ఐలయ్యతో పాటు కో-ఆర్డినేటర్లు మువ్వా విజయ్‌బాబు, చామల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలను అభినందించి, చివరి దశను కూడా అదే నిబద్ధతతో పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఓటర్ల జాబితాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/review-meeting-with-blas-on-special-intensive-revision-program-at/article-19324

Tags: