మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి
విశ్వంభర, హిమాయత్ నగర్: పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని మహిళా రిజర్వేషన్ సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాదు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఐద్వా, పిఓడబ్ల్యూ-1, సిఎంఎస్, పిఓడబ్ల్యూ-2 ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ప్రజాస్వామ్యానికి నష్టమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో అమలవుతున్న మహిళా రిజర్వేషన్ మాదిరిగానే పార్లమెంట్, అసెంబ్లీల్లోనూ వెంటనే అమలు చేయాలని, అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి కె. నాగలక్ష్మి అధ్యక్షత వహించగా, మల్లు లక్ష్మి, స్వరూప, భారతి, ఆర్. అరుణజ్యోతి, కె.ఎన్. ఆశలత, పి. ప్రభావతి, పి. శశికళ తదితరులు పాల్గొన్నారు.