వీధి కుక్క దాడి లో 44మేకలు మృతి
- బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
విశ్వంభర, సిద్దిపేట: అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు గాంతి శ్రీనివాస్‌కు చెందిన గొర్రెలు, మేకల మందపై కుక్కలు దాడి చేయడంతో 44కుపైగా గొర్రెలు, మేకలు మృతిచెందాయి. మరో 25 గొర్రెలు, మేకల పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఆత్మ కమిటీ ఛైర్మన్ పూజల గోపికృష్ణ మంగళవారం బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమొత్తంలో జీవాలను కోల్పోవడం రైతుకు తీరని ఆర్థిక నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతుకు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యుడు మధు, నాయకులు లక్ష్మీనారాయణ, డైరెక్టర్ అజ్మత్, జనార్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి, ఇసాక్, వెంకట్ రెడ్డి, నర్సయ్య గ్రామస్తులు పాల్గొన్నారు