ధర్మారెడ్డిపల్లి కాలువ నుంచి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్
- ధర్మారెడ్డిపల్లి కాలువ నుంచి సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, ధర్మారెడ్డిపల్లి కాలువ జీరో పాయింట్ వద్ద నుంచి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ, భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కాలువ పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కాలువల ఆధునీకరణతో వేలాది ఎకరాలకు సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ధర్మారెడ్డిపల్లి కాలువ పనులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశామని చెప్పారు. గతంలో నీటి కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనగా, ఇప్పుడు కాలువ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.